బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (12:43 IST)

ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. Special Status Beer తెచ్చారు.. షర్మిల

ys sharmila
వైఎస్ షర్మిల కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తూ.. తన సోదరుడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు జగన్‌పై పలుమార్లు ఆరోపణలు చేసిన లిక్కర్ మాఫియాను టార్గెట్ చేశారు. 
 
ఏపీలోని మద్యం మాఫియా భారతదేశంలోనే అతిపెద్ద మాఫియా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కలుషిత మద్యం వల్ల మరణాలు 25 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని జగన్‌ను కోరగా, ఆయన ప్రత్యేక హోదాకు బదులు బీర్‌ తీసుకొచ్చారు. ఏపీలో నకిలీ మద్యం బ్రాండ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు.
 
ఏపీలో మద్యం అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలిసినా బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు పిలవకపోవడం దారుణమని షర్మిల అన్నారు. ఏపీలో మద్యం విక్రయాల ఆర్థిక రికార్డులపై కాగ్ ఆడిట్ అవసరమని షర్మిల చెప్పారు.