భర్తతో బైకు కోసం గొడవ.. భార్య ఆత్మహత్య...

crime scene
crime scene
సెల్వి| Last Updated: మంగళవారం, 19 మే 2020 (15:00 IST)
లాక్ డౌన్ కారణంగా భర్తతో ఏర్పడిన ఘర్షణ ఓ గృహిణి ఆత్మహత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. అస్సోం రాష్ట్రానికి చెందిన మిథున్‌దత్త, అనిదత్త(24) దంపతులు మూడేళ్ల క్రితం వలస కూలీలుగా హైదరాబాద్ నగరానికి వచ్చారు. మిథున్‌దత్త బోయినపల్లిలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు.

మిథున్‌ దత్త బైక్‌ను గ్రామంలో ఉన్న అనిదత్త అన్నయ్య వాడుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ బైక్‌ మిథున్‌దత్త అన్నయ్యకు అవసరం పడింది. ఆ బైక్‌ను తన అన్నయ్యకు ఇవ్వాలని మిథున్‌దత్త భార్యకు తెలిపాడు. దీనిపై వారం రోజులుగా భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. ఆదివారం రాత్రి గొడవ పెద్దది కావడంతో మనస్తాపానికి గురైన అనిదత్త గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.

ఎంతసేపటికీ భార్య బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన భర్త లోనికి వెళ్లిచూడగా రాడ్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :