ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:01 IST)

పవన్‌తో భేటీ అయిన వైకాపా కీలక నేత!

bonthu rajeswara rao
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వైకాపాకు చెందిన కీలక నేత ఒకరు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఆ నేత పేరు బొంతు రాజేశ్వర రావు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైకాపా కీలక నేత. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా రాజేశ్వర రావు పోటీ చేయగా, ఆయనపై జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 
 
ఇపుడు రాజేశ్వర రావు జనసేనానితో భేటీ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్.డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వర రావు హైదరాబాద్ నగరంలోని జనసేన పార్టీ కార్యలయంలో సమావేశమయ్యారు. 
 
కాగా, ఈయన గత 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైకపా నేతలు అంటీఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కావడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశంగా మారింది. ఈయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ఇరు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.