సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (09:48 IST)

2019 ఎన్నికల ప్రచార అస్త్రంగా ప్రత్యేక హోదా.. బాబు దీక్ష రోజున జగన్ కీలక ప్రకటన?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా నినాదాన్నే 2019 ఎన్నికలకు ప్రచారాస్త్రంగా మలచుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే టీడీపీ బీజేపీకి మద్దతిచ్చి గెలిపించినా.. ఏపీకి కేంద్రం మొండిచే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా నినాదాన్నే 2019 ఎన్నికలకు ప్రచారాస్త్రంగా మలచుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే టీడీపీ బీజేపీకి మద్దతిచ్చి గెలిపించినా.. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపెట్టిన తరుణంలో.. వైకాపా బీజేపీని నమ్మొచ్చా.. కూడదా? అనే డైలమాలో పడింది.


ప్రజలకు మాటిచ్చి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్తే.. ఆపై  అది కుదరకపోతే.. ఇక ప్రజల్లో మాట తప్పిన ముద్ర పడిపోతుందని వైకాపా భావిస్తోంది. ఇందులో భాగంగా ఆచితూచి వ్యవహరించాలని వైకాపా భావిస్తోంది. 
 
మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజీ వచ్చిందని భావించిన జగన్, సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే.. అన్నీ విషయాలకు కలిసివస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.