శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (09:13 IST)

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. అదీ బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులే అత్యధిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని ఏడీఆర్ తెలిపింది

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. అదీ బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులే అత్యధిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని ఏడీఆర్ తెలిపింది.


యూపీ ఉన్నావో, కథువా ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ప్రజలకు అండగా వుంటామని అధికారంలోకి వచ్చే ప్రజా ప్రతినిధుల్లో చాలామంది కామాంధులు వున్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది. మొత్తం 1,581 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు తమపై కేసులు ఉన్నట్టు ప్రస్తావించగా, మహిళలపై దాడులు, రేప్ సెక్షన్లకు సంబంధించి 51 మందిపై కేసులున్నాయని పేర్కొంది.  
 
ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో 51 మందిపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాచారం వంటి ఆరోపణలు ఉండగా, వారిలో అత్యధికులు బీజేపీకి చెందినవారేనని ఏడీఆర్ వెల్లడించింది. కేసులను ఎదుర్కొంటున్న వారిలో 48 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వారిలో 14 మంది బీజేపీ వారేనని తెలిపింది. ఇక రెండో స్థానంలో శివసేన ప్రజా ప్రతినిధులు ఏడుగురు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు కేసులు నమోదైనట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. అలాగే మూడో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (6) ఉందని తెలిపింది.