మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:26 IST)

షీనాబోరా హత్య కేసు: ఇంద్రాణి ముఖర్జియా ప్రాణాలకు ముప్పు?

షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్ర

షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్రవారం రాత్రి జేజే ఆస్పత్రికి తరలించారు. సోమవారం నాగ్‌పడా పోలీసుల బృందం ఆస్పత్రికి వచ్చి ఆమె వాంగూల్మాన్ని తీసుకున్నారు. 
 
ఈ వాంగూల్మంలో తన ప్రాణాలకు హాని వుందని.. తనను సీబీఐ రక్షణలో వుంచాలని వేడుకున్నారు. కాగా షీనా బోరా కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి.
 
ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఆధ్వర్యంలోని 9ఎక్స్ మీడియా అయిన ఐఎన్ఎక్స్ మీడియా ఆయనకు ముడుపులు చెల్లించిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు వుందని ఇంద్రాణి వాంగూల్మంలో చెప్పారు