గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (12:40 IST)

నెల్లూరులో బరితెగించిన వైకాపా నేత - వృద్ధురాలిపై హత్యాయత్నం

murder
నెల్లూరు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన  ఓ నేత బరితెగించాడు. ఆయన పేరు చల్లా మహేష్ నాయుడు. ఈయన తన భార్యతో కలిసి జిల్లాలోని కుమ్మరకొండూరు ప్రాంతానికి చెందిన రత్నమ్మ అనే వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు చల్లా మహేష్ నాయుడు ప్రయత్నించగా, వృద్ధురాలు రత్నమ్మ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తమకు అడ్డు తగిలిన వృద్ధురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్‌ఆర్‌సీపీ నేత చల్లా మహేశ్‌ దంపతులు ఆమెపై దాడి చేసి కాలుతో తన్ని, గొంతుకోసేందుకు ప్రయత్నించారు. దీనిపై బాధితారులు మీడియాతో మాట్లాడుతూ, చల్లా మేహష్ నాయుడు దంపతులు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఈ భూవివాదం కోర్టులో ఉందని, అయినప్పటికీ వారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు.