శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (22:42 IST)

పవన్‌ను ఎక్కడైనా ఓడిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సవాల్

వచ్చే ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తాము ఓడిస్తామని  కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. 
 
ప‌వ‌న్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్‌చార్జిగా పోస్ట్ తీసుకుంటానని, అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్‌ను ఓడిస్తానని తెలిపారు.
 
మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌నే వెన్నుపొటు పొడిచిన చ‌రిత్ర‌ చంద్రబాబుకు ఉంద‌ని, పవన్ క‌ల్యాణ్‌ ను వెన్నుపోటు పొడవడం ఆయ‌న‌కు ఓ లెక్కకాద‌ని అన్నారు. 
 
పవన్ జనసేన కార్యకర్తలకు ఆయ‌న మ‌ళ్లీ అన్యాయం చేస్తున్నారని, పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు.