మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: మంగళవారం, 26 మార్చి 2019 (19:50 IST)

నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని పక్కన పెట్టిన అధికారి... గల్లంతేనా?

ఏపీ మంత్రి నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి పక్కనపెట్టారు. దీనికి గల కారణాలను చూస్తే.... ఆయన గుంటూరు జిల్లాలో నివాసముంటూ కృష్ణా జిల్లాలో నోటరీ చేయించడంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చూసిన రిటర్నింగ్ అధికారి లోకేష్‌ నామినేషన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
 
కాగా ఈ తప్పులను సరిదిద్దేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరగా అధికారి ఒక రోజు సమయమిచ్చారు. ఇప్పటికే తండ్రి చంద్రబాబు నాయుడు పేరును భర్తగా వున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ నామినేషన్ పత్రాన్ని ఆమోదిస్తారో లేదో చూడాల్సి వుంది.