మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికల సిత్రాలు
Written By జె
Last Modified: సోమవారం, 25 మార్చి 2019 (11:53 IST)

నారా లోకేష్ భర్త చంద్రబాబు, నామినేషన్ పత్రంలో అలా వుందా? ఏమౌతుంది?

భర్త పేరు ఉండాల్సిన చోట తండ్రి పేరు. ఆస్తులు రాయలేదు. అప్పులు చెప్పలేదు. ఫోటో కూడా అధికారులు చెప్పేంత వరకు అంటించనే లేదు. వివరాలు అందించాల్సిన చోట ఖాళీ పేపర్లు పెట్టారు. ఎన్నికలకు నేతలు సమర్పించే నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లడం విమర్సల పాలవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇది కాస్త వైరల్‌గా మారింది. 
 
ఎపి వ్యాప్తంగా ఎన్నికల వేడి హోరెత్తుతోంది. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవనుంది. ఈ నెల 22నుంచి ఎన్నికల ముహూర్తమని రాజకీయ నాయకులు నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అయితే ఇందులో పలువురు నామినేషన్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో ఆ నేతలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సిఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో నామినేషన్‌ను దాఖలు చేయగా లోకేష్ మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యమంత్రి నామినేషన్ పత్రాల్లోని ఒక అనుబంధ పత్రాల్లో ఖర్జూర నాయుడు తండ్రికి బదులు భర్తగా పేర్కొన్నారు. అదే తప్పు లోకేష్ పత్రాల్లో కూడా చోటుచేసుకుందట. చంద్రబాబునాయుడును ఆయన భర్తగా రాశారు. ఓటర్ల జాబితాలో అభ్యర్థి ఎక్కడైతే నమోదయ్యాడో ఆ ఓటర్ జాబితాలోని పత్రాన్ని నామినేషన్‌కు అనుబంధంగా సమర్పించాల్సి ఉంటుంది. 
 
సరిగ్గా ఇదే పత్రంలో దారుణమైన పొరపాట్లు చోటు‌చేసుకున్నాయి. నిజానికి ఈ పత్రాన్ని సంబంధిత ఎన్నికల అధికారి జారీ చేశారు. వారే తప్పు చేశారని టిడిపి వర్గాలు అంటున్నాయి. అయితే ఇంత పెద్ద తప్పును ఎవరూ గుర్తించలేదు. ఇదే కాపీని చంద్రబాబు తనయుడు లోకేష్ ఎన్నికల అఫిడవిట్లకు జత పరిచారు. మొత్తంమీద ప్రముఖ పార్టీల నేతలు నామినేషన్ పత్రాల్లో ఇలాంటి తప్పుడు దొర్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.