సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (18:18 IST)

జగన్ ఆస్తుల విలువ రూ.538 కోట్లు... అంతేనా అంటూ చంద్రబాబు షాక్...

ఏపీలో నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసిపోతుంది. ఈ నేపధ్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే తమతమ నామినేషన్లు దాఖలు చేశారు. దీనితోపాటు తమ ఆస్తులు, తమకున్న అప్పులు, తమపై వున్న కేసుల వివరాలను తెలియజేశారు. కేసులు, అప్పులు గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఏ నాయకుడికి ఎంత ఆస్తులున్నాయన్నది మాత్రం అంతా ఆసక్తిగా తెలుసుకునేందుకు చూస్తారు. 
 
ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ బాబుతో పాటు మరికొందరి నాయకుల ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆస్తులపై తెదేపా నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఎవరికెన్ని ఆస్తులున్నాయో చూద్దాం.
 
ఏపీ మంత్రి నారాయణ కుటుంబ ఆస్తుల మొత్తం రూ.667 కోట్లుగా వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తుల విలువ రూ.574 కోట్లుగా తెలియజేశారు.
ఇకపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అఫిడవిట్ ప్రకారం ఆయన కుటుంబం ఆస్తుల విలువ రూ.538 కోట్లు.
 
జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ఆస్తులు నిజంగా షాకింగ్‌గా వున్నాయంటూ తెదేపా నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు సైతం ఆస్తుల అంతేనా అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించినట్లు సమాచారం.