గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By జె
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:20 IST)

పవన్ కళ్యాణ్‌ను సిఎం ఎందుకు చేయాలో తెలుసా?: హైపర్ ఆది

తిరుపతిలోని తారకరామ స్టేడియం జనసేన - బిఎస్పీ ఎన్నికల యుద్థభేరిలో హైపర్ ఆది ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మార్పు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన జనసేనాని జనానికి అవసరమన్నారు.
 
వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకండని, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రధాన పార్టీలు డబ్బులు చల్లుతున్నాయన్నారు. ఉచిత విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి, రైతుల కష్టాలు తీరాలంటే జనసేన పార్టీని గెలిపించాలని,సేవ చేయడానికి అధికారం అవసరం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు పోలికే లేదని, పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీలు కాదు సిఎంను చేయాలన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవటం కాదు గెలవటం ముఖ్యమన్నారు. 
 
ఓట్ ఫర్ గ్లాస్ నాట్ ఫర్ క్యాష్ అని, నాలుగుసార్లు సిఎంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాయావతి అన్నారు. దళిత జ్యోతి మాయావతి కాళ్ళకు పవన్ కళ్యాణ్ దణ్ణం పెడితే తప్పేమీ లేదన్నారు. ఒక్క ఛాన్సు పవన్ కళ్యాణ్‌కు ఇవ్వండని కోరారు.