సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (19:10 IST)

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

Exit Poll 2024
Exit Poll 2024
ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి విజయం ఖాయమని చెప్తున్నాయి. పలు రకాల సర్వే సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ ముందంజలో ఆపై వైసీపీ రెండో స్థానంలోనూ, జనసేన మూడో స్థానంలో, బీజేపీ నాలుగో స్థానంలో వున్నాయి. 
 
ఆత్మ సాక్షి సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో వైఎస్సార్‌సీపీ 98-116 సీట్లు గెలుస్తుందని, కూటమి 59-77 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఇక జాతీయ స్థాయిలో జన్‌బీబాత్ సర్వే ఎన్డీయేకే పట్టం కట్టింది. ఎన్డీయే 362-392, ఇండియా కూటమి 141-161, ఇతరులు -10-20గా వుంది.