1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
  4. Pawan Kalyan speech at Rayalaseema Railway koduru

వాళ్లిద్దర్నీ తొక్కేయడానికి మీకుందా గుండెబలం?: పవన్ కల్యాణ్

pawan kalyan
రాయలసీమలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార సభకి భారీ జనసందోహం తరలి వచ్చారు. జన ప్రభంజనతో రైల్వేకోడూరు నియోజకవర్గ పోటెత్తింది. కోస్తా క్లీన్ స్వీప్ చేస్తుందనే వార్తలు వస్తుండగా రాయలసీమలో సైతం మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే దిశగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రయాణిస్తున్నాయని ప్రస్తుత జనప్రభంజనాన్ని చూస్తే అర్థమవుతుంది.
 
రాజాంపేట నియోజకవర్గం ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి. జగన్ రెడ్డిని ఓటు ఆయుధంతో అధ:పాతాళానికి తొక్కేయండి. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని డ్రగ్స్ మత్తులో ముంచేసిన జగన్‌ని రానున్న ఎన్నికల్లో తరిమి కొడదాం, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిద్దాం. మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి అనే ఇద్దర్ని తొక్కేయడానికి మీకు గుండె బలం వుందా అంటూ సూటిగా ప్రజలనుద్దేశించి అన్నారు. మీరు ధైర్యంగా ఓటు వేయండి మీ వెనుక నేనున్నాను అంటూ చెప్పారు పవన్ కల్యాణ్.
 
తర్వాతి కథనం
ప్రీమియం ప్లాన్‌ల విడుదలతో సబ్‌స్క్రిప్షన్ మార్కెట్‌ను పునర్నిర్వచించేందుకు సిద్ధమైన జియో సినిమా