గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2024 (23:20 IST)

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

Pawan Kalyan in Pithapuram
రాష్ట్రానికి రాజధాని అమరావతి లేకుండా చేసావు ప్రజలకు మండదా జగన్ మోహన్ రెడ్డి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు మీరు చేసిన పనులతో కడుపు మండుతోందని అన్నారు. ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 

''పోలవరం రాకుండా చేసావు ప్రజలకు మండదా?
అంగన్వాడీలను కాళ్లతో తొక్కిస్తే ప్రజలకు మండదా?
ఆశావర్కర్లను అరెస్ట్ చేస్తే ప్రజలకు మండదా?
అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు ప్రజలకు మండదా?
15 ఏళ్ల అమర్నాథ్ ను చెరకుతోటలో తగులబెట్టినవారికి బెయిల్ ఇప్పించావు, ప్రజలకు మండదా?
దళిత డ్రైవరును చంపేసి డోర్ డెలివరీ చేసావు, ప్రజలకు మండదా?
దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసి చంపావు ప్రజలకు మండదా?
30 వేల మహిళలు అదృశ్యమైతే ప్రజలకు మండదా?
నిరంకుశమైన నీ పాలన చూస్తే ప్రజలకు మండదా?
ప్రజలకు కడుపు మండి వున్నారు జనం'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.