శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (13:51 IST)

ఏపీలో త్వరలో రామరాజ్యం.. చంద్రబాబు

Chandra babu Naidu
శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ రామరాజ్యం లేదా శ్రీరాముడు ఉదహరించిన నీతివంతమైన పాలన త్వరలో నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. 
 
త్రేతాయుగంలో ప్రజల అభీష్టం, సంక్షేమం మేరకే పరిపాలించినందుకే శ్రీరాముడు నేటికీ ఆరాధ్యుడు అయ్యాడని, పాలకులు తమ కుటుంబాల కంటే ప్రజల సుఖ సంతోషాలకే ప్రాధాన్యత ఇస్తారని గుర్తు చేశారు.

ఇలాంటి పాలనలో గ్రామం పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి నెలకొంటుందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రామరాజ్యం లాంటి సుసంపన్నత, ప్రశాంతత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.