1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (21:30 IST)

ఘనంగా 32 వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభం

32వ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ విశ్వ‌భూష‌ణ్ వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.

 
చరిత్రాత్మ‌క‌మైన బెజ‌వాడ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఆనందం ఉందని గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఆనంతరం దేవదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  ఆర్థిక సమస్యల్ని, కరోనా సమస్యలను అధికమించి బుక్ ఎగ్జిబిషన్ ను నిర్వహించిన నిర్వహకులను అభినందించారు. విజయవాడ మధ్య నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితితుల్లో పుస్తక పఠనం అనేది తగ్గిందని, ఈ సమయంలో బుక్ ఎగ్జిబిషన్ ప్రారంబించడం శుభసూచికమన్నారు. గత చరిత్ర తెలుసుకోవ‌డం ద్వారా పురోగతి సాదించవచ్చునని, అది పుస్తక పఠనం ద్వారా సాద్యమౌతుందని అన్నారు. ఇక్క‌డ‌ అన్ని రకాల పుస్తకలు లభిస్తాయని అన్నారు. బుక్ ఫెస్టివల్ విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలిపే విధంగా చేసిన బుక్ ఫెస్టివల్ కమిటీని అభినందించారు. 
 
 
విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ, నేటి తరానికి పుస్తకం పఠనం తగ్గిపోయిందని, యువత డిజిటల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. బుక్ ఫెస్టివల్ సంక్షోభానికి పరిష్కారాన్ని సూచిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా విజయ్ కుమార్ వ్యవహరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్షులు మనోహర్ నాయుడు, బాబ్జీ, లక్ష్మయ్య  పాల్గొన్నారు.