కాశీలో తెలుగువారి కోసం మరో అధునాతన సత్రం ప్రారంభం
వారణాసిలో తెలుగువారి కోసం మరో అధునాతన సత్రం నేడు ప్రారంభం అవుతోంది. తెలుగు యాత్రికుల కోసం కాశీలో ఈ అధునాతన కరివెన సత్రం నిర్మించారు. ఈ తెల్లవారుజామున 4:05 నిలకు కాశీ- పాండే హవేలీలో కరివెన సత్రం నిర్మించిన నూతన భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
వారణాసి (కాశీ) లోని పాండే హవేలిలో అఖిల భారత బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించి, ఈ కార్తీకమాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ సత్రం ప్రారంభించారు. 34 కొత్త గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రం నిర్మాణం చేశారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం నాలుగు చోట్ల కరివెన సత్రం ఆద్వర్యంలో నిత్యాన్న దాన, వసతి సౌకర్యం సేవలు అందిస్తున్నారు.
ఇన్ని సత్రాలున్నా, కాశీకి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అయిదో భవనాన్ని అఖిల భారత బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు. ఇది యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఖిల భారత బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు తెలిపారు. ఎక్కడి నుంచి అయినా ఇందులో గదులను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని, అయితే నియమ నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని తెలిపారు.