గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (09:33 IST)

కివీస్ టెస్ట్ సిరీస్‌కు హనుమ విహారిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు?

త్వరలో స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు క్రికెట్ సిరీస్‌ను ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియా జట్టును కూడా ఎంపిక చేశారు. ఇందులో యువ బ్యాట్స్‌మెన్ హనుమ విహారికి చోటుదక్కలేదు. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. 
 
త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని (Gavaskar on Vihari) ఎంపిక చేయకపోవడం తాననేమి ఆశ్చర్యానికి గురిచేయలేదన్నారు. విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్‌ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. 
 
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదన్నారు. ఇటీవలి కాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. నవంబర్‌ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు ఇటీవలే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చాయి.
 
'నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు.' అని గావస్కర్​ అభిప్రాయపడ్డారు.