శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (16:54 IST)

ఎనిమిదేళ్ళ చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..

rape
కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణకు దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల వెన్నులో వణుకు పుట్టడం లేదు. ముఖ్యంగా ఏపీలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కేంద్రంలో ఎనిమిదేళ్ళ చిన్నారిని బలవంతంగా నిర్మాణంలో ఉన్న ఓ సచివాలయంకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
 
వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా తవణంపల్లె గ్రామానికి చెందిన ఉమాపతి(70) ఏళ్ల వృద్దుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే భార్య మృతి చెందడంతో ఉమాపతి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఎనిమిదేళ్ల బాలికపై ఉమాపతి కన్ను పడింది. 
 
నిన్న సాయంత్రం బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటూ వుండగా.. ఉమాపతి బాలికకు మాయమాటలు చెప్పాడు. చాక్లెట్స్, బాస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపాడు. కానీ బాలిక వృద్దుడి మాటలను వినకుండా ఆడుకుంటూ ఉండగా, ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా నిర్మాణంలో ఉన్న సచివాలయం లోనికి తీసుకెళ్లాడు. ఆ తరువాత బాలికను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
బాలిక వృద్దుడుని నెట్టి బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నం చేయడంతో బాలిక నోటిని అదిమిపట్టి సచివాలయం లోనికి బలవంతంగా లాక్కెళ్లి ఆ తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు విని బాలిక తల్లి పరుగులు తీస్తూ సంఘటనా స్థలానికి వచ్చింది. దాంతో ఉమాపతి పరార్ అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.