ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 4 మార్చి 2019 (21:36 IST)

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగుడు బీభత్సం.. గొంతుపై కత్తితో గాటు పెట్టి బంగారంతో పరార్

నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ జరిగింది. చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ తెనాలి, దుగ్గిరాల వద్దకు రాగానే మహిళా భోగిలోకి ఓ దుండగుడు ఎక్కాడు. వెంటనే కత్తి బయటకు తీయడంతో మహిళా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వారిలో ఓ మహిళా ప్రయాణికురాలి వద్దకు వెళ్లి డబ్బు, బంగారు చైన్ ఇవ్వాలని బెదిరించాడు. 
 
ఆమె నిరాకరించడంతో కత్తితో మెడపై గాటు పెట్టి గాయం చేశాడు. దాంతో ఆమెకు రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆమె మెడలో బంగారు గొలుసు, రూ. 1000 నగదు తీసుకుని బండి నుంచి దూకేసి పారిపోయాడు. బాధితురాలు ఖమ్మంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.