ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (14:15 IST)

హైటెక్ దోపిడీ.. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి..

దోపిడీ దొంగలు రూటు మార్చారు, ఎప్పుడూ ఒకే విధంగా దొంగతనాలు చేసి విసిగిపోయి కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లున్నారు. ఇప్పుడు రోడ్డు పక్కన అందమైన అమ్మాయిలను ఎరగా వేసి దోపిడీలు చేస్తున్నారు. వాహనదారులను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు ఈ ఉపాయాన్ని ఆలోచించారు.
 
తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడలో రాత్రి వేళల్లో దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రోడ్డు పక్కన ఒక మహిళను నిలబెట్టి అటుగా వచ్చే వాహనాన్ని లిఫ్ట్ అడిగినట్లు నటిస్తారు. పొరపాటున ఎవరైనా బండి ఆపితే అయిపోయినట్లే, ఆ చుట్టుపక్కల కాపు కాసి ఉన్న దొంగలు ఒక్కసారిగా వాహనదారుల మీద దాడి చేస్తారు. ఆ తర్వాత వారి వద్ద ఎంత ఉంటే అంతా దోచుకుంటారు. ఒకవేళ వారికి ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికైనా వెనుకాడటం లేదు.
 
తాజాగా ఒక లారీని ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్‌ని చితకబాది వారి వద్ద ఉన్న 10 వేలు లాక్కొని వెంటనే అటుగా వస్తున్న మరో కారును ఆపే ప్రయత్నం చేయగా కారు నడిపే వ్యక్తి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దోపిడీ చాలా కాలంగా జరుగుతున్నట్లు సమాచారం.