శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 29 జనవరి 2020 (13:59 IST)

చైనా నుంచి అవనిగడ్డకు వచ్చిన యువ డాక్టర్... ఏదో తేడా వుందా?

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అక్కడి జనం పిట్టల్లా రాలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అవనిగడ్డలో చైనా నుంచి వచ్చిన యువ డాక్టర్ పైన ఫోకస్ పెట్టారు.
 
చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న అవనిగడ్డ విద్యార్థి స్వస్థలమైన అవనిగడ్డకు వచ్చాడు. విద్యార్థి చైనా నుంచి రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై విద్యార్థి పైన ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 
 
వైద్య విద్యార్థి వివరాలను బహిర్గతం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.