గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:26 IST)

శ్రీ సిటీకి ఎసి విడిభాగాల త‌యారీ కంపెనీ యాంబ‌ర్ రాక‌

రూమ్ ఎయిర్ కండీషనర్లు, విడిభాగాల తయారీలో పేరుగాంచిన యాంబర్ ఎంటర్‌ప్రైజెస్
ఇండియా లిమిటెడ్ సంస్థ శుక్రవారం శ్రీసిటీలో తన నూతన పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేసింది. ఈ సంస్థకు ఇది దేశంలో 15 వ ప్లాంట్ కాగా, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. ఈ పరిశ్రమలో ప్రధానంగా ఏసీలు, ఏసీ విడిభాగాలు ఉత్పత్తి చేసి, దేశంలోని 20కు పైగా ప్రముఖ ఏసీ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. డైకిన్, బ్లూస్టార్, యాంబర్ వంటి వరుస ఏసీ కంపెనీలతో ఏసీల తయారీ రంగంలో శ్రీసిటీలో సరికొత్త వ్యాపారానుకూల వ్యవస్థ రూపుదిద్దుకుంటూ మరిన్ని కంపెనీలను ఆకర్షిస్తోంది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. 
 
శ్రీసిటీకి గత నెల రోజులు ఎంతో విశిష్టత సంతరించుకున్న కాలంగా పేర్కొనవచ్చు. మూడు వారాల క్రితం ఇపిసిఇసి నుండి 2020-2021 కోసం 'డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు' శ్రీసిటీకి దక్కగా, మూడు రోజుల క్రితం ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ వారి ఇండస్ట్రీయల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0లో దేశంలోని 349 ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్‌లలో లీడర్‌ గా శ్రీసిటీ ర్యాంక్ కైవసం చేసుకుంది.