సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (23:31 IST)

దమ్ముంటే ఎమ్మెల్యే రోజా రాజీనామా చేయాలి.. అచ్చెన్నాయుడు సవాల్

టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు నగరి ఎమ్మెల్యే  రోజాకు సవాల్ విసిరారు. నగరిలో తాము గెలవకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
 
మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేస్తే, ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని తిట్టిపోశారు. సింపతీ కోసం కోడికత్తి డ్రామాలాడారని ఎద్దేవా చేశారు.
 
అది వర్కౌట్ అవ్వకపోవడంతో మరింత సింపతీ కోసం సొంత బాబాయిని హత్య చేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని తూలనాడారు.