బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (17:53 IST)

అన్యాయాన్ని నిలదీసే మీసమున్న మగాడే లేడా? శివాజీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయమై ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేసే నేతలే లేరా అంటూ సినీ నటుడు శివాజీ ఆవేశంగా ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయమై ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేసే నేతలే లేరా అంటూ సినీ నటుడు శివాజీ ఆవేశంగా ప్రశ్నించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, తెలుగు ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు.
 
ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తాననడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. మనకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే నేతలే లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలని, ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, దానిని ఢిల్లీకి తీసుకెళ్లాలని శివాజీ డిమాండ్ చేశారు.