గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:20 IST)

బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించిన సోనూ సూద్ దంప‌తులు

అమ్మ‌ల‌గ‌న్న అమ్మ‌, బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, సంఘ సేవ‌కుడు సోనూ సూద్ ద‌ర్శించుకున్నారు. ఆయ‌న త‌న కుటుంబ స‌మేతంగా దుర్గ‌గుడికి రావ‌డంతో, ఆల‌య పూజారులు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం క‌ల్పించారు. అమ్మ‌వారికి సోనూసూద్ దంప‌తులు భ‌క్తి శ్ర‌ధ‌ల‌తో న‌మ‌స్క‌రించి, ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం సోనూ దంప‌తుల‌కు వేద పండితులు ఆల‌య ప్రాంగ‌ణంలో ఆశీర్వ‌చ‌నం చేశారు. అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని, చిత్ర ప‌టాన్ని సోనూ సూద్ కు అందించారు. 
 
విజయవాడలో ఒక రోజు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సోనూ సూద్, ఉద‌యం గ‌న్న‌వ‌రం ఎయిపోర్ట్ నుంచి హోట‌ల్ నోవాటెల్ కు చేరారు. అక్క‌డ నుంచి అంకురా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు.  అనంత‌రం ఆయ‌న సాయంత్రం అమ్మవారి దర్శన, పూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు.