గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (12:21 IST)

టీడీపీ మహానాడు.. పసుపుమయం అయిన రాజమండ్రి.. అన్నీ ఏర్పాట్లు పూర్తి

Telugudesam
Telugudesam
రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు జరగబోతోంది. వంద ఎకరాల్లో మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ మహానాడు పండగ జరుగుతోంది. వేదికపై 320 మంది టీడీపీ నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తూర్పు సెంటిమెంట్‌తో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు ప్రజలు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రాజమండ్రి పసుపుమయమైంది.
 
మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ప్రముఖ మంజీరా, సెల్టన్‌ హోటల్స్‌లో 100కు పైగా రూములను మూడు రోజులపాటు బుక్ చేసుకున్నారు టీడీపీ నేతలు. 15 నుంచి 20 వరకూ ఉన్న చిన్నచిన్న హోటల్స్‌లోనూ అన్ని రూములు బుక్ అయిపోయాయి.