గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (09:37 IST)

రైతుల భారీ పాదయాత్ర.. అమరావతి నుంచి అరసవల్లి వరకు..

amaravati capital
అమరావతి రైతులు మరోసారి భారీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 
 
అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకు పైగా కొనసాగనుంది. ఇంకా అమరావతిలో ప్రారంభమై అరసవల్లిలో ముగియనుంది. ఈ రైతుల భారీ పాదయాత్ర పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.