అద్భుతంగా అయోధ్య రామాలయం: బిజెపి ఎంపి జివిఎల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు బిజెపి రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం దర్శించుకున్నారాయన. ఆలయం వెలుపల బిజెపి ఎంపి మీడియాతో మాట్లాడుతూ కొత్త బడ్జెట్ తరువాత ఆర్థిక ప్రగతి మరింత పుంజుకోవాలని ప్రార్ధించానని చెప్పారు.
తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామి వారి దీవేనలతో తిరిగి వెళ్ళే సమయంలో మనస్సు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని.. కరోనా కష్టం కాలం తరువాత దేశం అభివృద్ధి వైపు నడుస్తుందని, స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేశంపై ఉండాలని కోరానన్నారు. మరొకసారి కరోనా లాంటి వ్యాధులతో దేశ ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాలని కోరినట్లు చెప్పారు.
రామ మందిరం అయోధ్యలో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు దేశ వ్యాప్తంగా హిందూవులు విరాళాలు అందించారని.. దేశ ప్రజలంతా రామ మందిరం నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. అనేక శతాబ్ధాల నుండి నేరవేరని కల ఈ సంవత్సరం నేర వేరుతున్నందుకు ప్రజలంతా ధన్యులు అవుతున్నారని.. భారతదేశ చరిత్రలో అయోధ్య రామాలయం ఒక అద్భుత మందిరంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పారు.