గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:28 IST)

నేడు రాష్ట్రపతితో... రేపు అమిత్ షాతో అమరావతి రైతుల భేటీ

ఈ నెల 8న కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో అమరావతి రైతులు సమావేశం కానున్నారు. రాజధాని మార్పు వల్ల జరిగే నష్టాన్నిఆయనకు వివరించనున్నారు.

శుక్రవారం ఉదయం రాష్ట్రపతి కోవింద్‌తో రైతులు, జేఏసీ నేతలు భేటీకానున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులు గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌నూ కలవనునున్నారు.

రాజధాని విభజనను నిరసిస్తూ 51 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. అమరావతిని తరలిస్తే తమకు నష్టమని.. మూడు రాజధానులు వద్దని.. ఒకే రాజధానికి కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా రాజధాని రైతుల ఆందోళనలు శుక్రవారానికి 52వ రోజుకి చేరాయి. మందడం,తుళ్లూరులో ధర్నా, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగనున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు కొనసాగనున్నాయి.