శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (09:04 IST)

ఎవరి గోచీ పట్టుకుని డబ్బులు తెస్తున్నారో తెలియదు.. చంద్రబాబుపై జేసీ ప్రశంసలు

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు మేథస్సుకు ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరిం

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు మేథస్సుకు ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరించాలంటూ పిలుపునిచ్చారు.
 
అనంతపురంలో జరిగిన మినీ మహానాడులో జేసీ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి గల నేత అని కితాబిచ్చారు. 'సీఎం ఏం చేస్తున్నారో ఏమో... ఎవరి గోచీ పట్టుకుని డబ్బులు తెస్తున్నారో తెలియదు. హంద్రీనీవాను మూడు నెలల్లో పూర్తి చేస్తానంటున్నారు. అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అతని మేథస్సుకు మనమంతా నమస్కారాలు పెట్టుకోవాలి' అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, అధికారంలో చంద్రబాబు ఉంటేనే కొంచెం తాగునీరు, కొంచెం సాగునీరు వస్తోంది. ఇంకెవ్వడు వచ్చినా అవి దొరకవు. ఆయనా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. ఆయనేమీ సాయిబాబా కాదు కదా. చంద్రబాబును ఎవరైనా విమర్శిస్తే పాపమొస్తుంది. ఇంకో ఐదేళ్లు అధికారమిస్తే అనుకున్నవన్నీ వస్తాయయ్యా. ఇదే మనం చేయాల్సిన పని' అంటూ టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.