శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (19:48 IST)

సీఎం జగన్ కేబినెట్‌లో పాతకాపులకు చెక్.. కొత్తముఖాలకు చోటు? (video)

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీ విస్తరించనున్నారు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. అయితే, ఎమ్మెల్యేలు మాత్రం మంత్రివర్గంలో చోటుకోసం తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. 
 
అయితే, పార్టీ వర్గాల సమాచారం, మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు జగన్ కేబినెట్‌లో చోటు ఇవ్వక పోవచ్చని సమాచారం. అలాగే మాజీ మంత్రులుగా ఉన్న వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం కల్పించి, మిగిలినవారందరినీ కొత్తవారిని తీసుకోవాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు సమాచారం. 
 
ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు మంత్రి రేస్‌లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి గౌతమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం.
 
ఇదిలావుంటే, మంత్రి వర్గ ఏర్పాటుపై సలహాలు, సూచనల కోసం వైఎస్ జగన్ మంగళవారం.. స్వరూపానంద స్వామిని కలవనున్నారు.