సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 జూన్ 2019 (13:07 IST)

కొత్త మంత్రివర్గం ముహూర్తం... స్వరూపానంద స్వామి వద్దకు సీఎం జగన్

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం విశాఖ చేరుకుని ఆయన, స్వామి స్వరూపానందను దర్శించుకోనున్నారు.
 
ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకూ ఆశ్రమంలో గడపనున్నారు. ఆపై తిరిగి అమరావతి చేరుకుంటారు. మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
 
దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు.
 ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.