ఏపీలో లాక్‌డౌన్ కొనసాగింపు.. అతి చేస్తే అంతే సంగతులు!
కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రక్రియ పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఏపీలో మళ్లీ లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రం లాక్ డౌన్ నుంచి సడలింపు ఉంది. ఈ సడలింపు సమయంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు లేదా మూడు వారాలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.
కాగా ఏపీలో కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. అందుకే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు.
ఈ పాస్ లేకుండా బయట తిరుగుతున్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధించాలని జగన్ ఉత్తర్వులు జారీ చేసింది.