ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 18వేల కేసులు... 71మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులతో పాటు కరోనా మరణాలు కూడా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 1,15,275 కరోనా పరీక్షలు చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ ఏపీలో 1,51,852 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
విశాఖ, విజయనగరం, తూ.గో. జిల్లాల్లో 9 మంది.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతిచెందారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులు హెచ్చరించారు.