శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (14:14 IST)

బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్‌-సమతాకు తప్పిన ముప్పు

train
బోగీల నుంచి ఇంజిన్ విడిపోవడంతో సమతా ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ముప్పు తప్పింది. ఇంజిన్ విడిపోయిన వెంటనే లోకోపైలెట్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్‌ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్‌ సమీపంలో బుధవారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్‌ వెళ్తున్న సమత సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్‌ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది. 
 
ఇది గమనించిన లోకో పైలెట్‌ అప్రమత్తమై వైర్లెస్‌లో డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి వెనక్కి రప్పించి బోగీలకు ఇంజన్‌ లింక్‌ చేసి పంపించడం జరిగింది. ఈ సంఘటనలో సుమారు గంటసేపు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.