ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (12:52 IST)

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభ పుస్తకావిష్కరణ

Pawan Kalyan,  Marishetty Murali Kumar
Pawan Kalyan, Marishetty Murali Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం 'ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?'. ఈ సమాచారాన్ని  మారిశెట్టి మురళీ కుమార్ గ్రంధస్తం చేశారు. 
 
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ గారు "ముందుమాట" రాయడం విశేషం. 
 
ఈ సందర్భంగా గ్రంధకర్త  మురళీ కుమార్ ను అభినందించారు. ఈ  పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ...  ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ,  ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారం నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.