గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (12:32 IST)

పవన్‌ కల్యాణ్‌కు 118 పేజీల సర్కారు నివేదిక...

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నాలుగేళ్లుగా అందిన విభజన నిధులు, ఇచ్చిన హామీలు, ఇంకా రావాల్సిన నిధుల వివరాల సమగ్ర నివేదికను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నాలుగేళ్లుగా అందిన విభజన నిధులు, ఇచ్చిన హామీలు, ఇంకా రావాల్సిన నిధుల వివరాల సమగ్ర నివేదికను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలోని జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ (జేఎ్‌ఫసీ) పరిశీలన కోసం ఈ నివేదికను ప్రభుత్వం తరపు దూత అందజేశారు. రాష్ట్ర విభజన నుంచి హామీల దాకా సాగిన నాలుగేళ్ల కేంద్రం అన్యాయాన్ని 118పేజీల ఈ నివేదికలో సుదీర్ఘంగా విశ్లేషించారు.
 
విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక ప్యాకేజీ హామీల వివరాలు, కేంద్ర బడ్జెట్‌కు ముందు సాయంపై ప్రధానికి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వివరాలు.. ఇలా మొత్తం మూడు సెట్ల నివేదికను పవన్‌కల్యాణ్‌కు చేర్చారు. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్‌ అందుబాటులో లేకపోవడంతో, అక్కడున్న ఆయన వ్యక్తిగత సిబ్బందికి నివేదికను అందించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు సీఎం చంద్రబాబు ఒప్పుకోవాల్సి వచ్చిందో ఇందులో సవివరంగా వివరించారు.