శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 11 మార్చి 2019 (18:46 IST)

175 కాదు 17, 25 కాదు 4.. జనసేన అభ్యర్థులు వీరే..!

రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ నిన్న హడావిడిగా విడుదలైంది. కేవలం నెలరోజులు మాత్రమే ఎన్నికల కోసం సమయం ఉంది. ఇప్పటికీ జనసేన పార్టీలో పూర్తిస్థాయిలో నాయకులు లేరు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్‌. 
 
అందుకే ప్రస్తుతానికి ఉన్న నేతలతో మమ అనిపించేద్దామన్న ఆలోచనకు వచ్చినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి 175 స్థానాల్లో 17 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అలాగే ఎంపిలకు సంబంధించి మొత్తం 25 ఉండగా 4 మాత్రమే ప్రకటించబోతున్నారు. అన్నీ స్థానాల్లో కాకుండా కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్‌ వచ్చినట్లు సమాచారం. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం మరో రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.