మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు...
అమరావతి: తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఏపీ ప్రభుత్వం మరోమారు నిప్పులు చెరిగింది. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని ఏపీ నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు.
రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం్ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటిపారుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించరించేందుకు కృషి చేస్తున్న సమయంలోనే, తెలంగాఫ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని తీవ్రంగా మండిపడ్డారు.
వైస్సార్‌పై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ మాటలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తమ నాయకుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నారని, తామూ అలా మాట్లాడగలమని, అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం అన్నందుకే అలా మాట్లాడటం లేదని వివరించారు.