బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (20:12 IST)

శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం అన్నాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో అన్నాభిషేకం ఏకాంతంగా నిర్వ‌హించారు.
 
ఇందులో భాగంగా  ఉద‌యం సుప్రభాత సేవ‌తో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.
 
అనంతరం సుమారు 150 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.

సాయంత్రం 5 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, విజివో బాలిరెడ్డి, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.
 
 
శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు తదితరులు పాల్గొన్నారు.