1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:01 IST)

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు ఇకపై ఆ నంబరుతో రిజిస్ట్రేషన్

ap map
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం వాహనాలకు ఏపీ 40జి సిరీస్‌పై నంబర్లను కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మోటార్ వాహన చట్ట సవరణ చేసి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని. అలాగే, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 
 
2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి ఏపీ 39 సిరీస్‌లో నెంబర్లను కేటాయిస్తుంది. ఇకమీద నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకునిరావడంతో ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలకు ప్రత్యేక తేడాను స్పష్టంగా తెలుసుకోవచ్చు. కొత్తగా చేసిన చట్ట సవరణ మేరకు అన్ని ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జి అనే సిరీస్‌తో నంబర్లను కేటాయిస్తారు.