శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (19:54 IST)

ప్రైవేట్ పాఠశాలలకు చెక్.. ఫీజులు పెంచితే గోవిందా.. జగన్

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను రెండేళ్లలో మారుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను మారుస్తామని సీఎం స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో సీఎం జగన్ బిల్లును ప్రవేశపెట్టారు. జగన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా సత్వర చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా పాఠశాల, కళాశాలల్లో విద్యావిధానాన్ని మెరుగుపరిచే గిశగా, విద్యను వ్యాపారంగా మార్చటాన్ని నిరోధించే దిశగా.. బిల్లును విడుదల చేశారు. ఈ బిల్లు ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించడంతో పాటు, విద్యా నాణ్యతను పెంచేదిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 
ఇంకా విద్యార్థుల చర్యలను గమనించేందుకు ఇరు కమిటీలను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా మంత్రులకు సొంతమైన పలు కళాశాలలు, పాఠశాలల్లో లక్షల్లో ఫీజులను వసూలు చేయడాన్ని నిరోధించేందుకు గాను ఈ జీవోను ప్రవేశపెట్టినట్లు సమాచారం.