శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (11:30 IST)

అనర్హత వేటు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే...

కర్నాటక రాజకీయాలు కొన్నిరోజులపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కర్నాటక శాసనసభ స్పీకర్ కె. రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన పతాక సన్నివేశంలో నిలిచారు. 
 
ముఖ్యంగా, 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి సంచలనం రేపారు. బీజేపీ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమైన తరుణంలో రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు కూడా వేశారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం ఆయన సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చట్ట వ్యతిరేకంగా ఉందనే విషయం తనకు అర్థమైందని... ఆ ధైర్యంతోనే వారిపై అనర్హత వేటు వేశానని చెప్పారు. 
 
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అదేసమయంలో తాను చేసింది గొప్ప పనేం కాదని... కాకపోతే, యువతరానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఇతర రాష్ట్రాల స్పీకర్లు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోరో తనకు అర్థం కాదని అన్నారు.