సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (18:01 IST)

అసెంబ్లీలో రాజధానిపై రగడ : 9 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పెద్ద రగడ జరిగింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిపార్సు మేరకు... స్పీకర్ తమ్మినేని సీతారాం తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 
 
అమరావతి రాజధాని భూముల పేరు క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెదేపా పాల్పడిందంటూ వైకాపా సభ్యులు ఆరోపించారు. దీనికి తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ ఎంతలా నచ్చజెప్పినా వారు శాంతించలేదు. 
 
దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న తెదేపా సభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌లను మంగళవారం ఒక్కరోజు మాత్రం సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.