శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (14:36 IST)

తమ్మినేని సీతారాం అసభ్య పదజాలం.. వీడియో వైరల్

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసభ్య పదజాలాన్ని వాడటం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, సోనియా పొత్తుపై తీవ్రంగా స్పందిస్తూ... అనకూడని మాటను తమ్మినేని ప్రయోగించారు. 
 
సీఎం జగన్ తిరుమల ఆలయం ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఏపీ స్పీకర్ ఇలా సహనం వదిలి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు తమ్మినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమ్మినేని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు. 
 
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.