మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:53 IST)

ఆయన ఎంపీ కాదు.. విజిటింగ్ ప్రొఫెసర్ : బీజేపీ ఎంపీలు సెటైర్లు

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు.

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌పై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఎంపీ కాదనీ, విజిటింగ్ ప్రొఫెసర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిన విషయమై లోక్‌సభలోజయదేవ్ ఇటీవల ఘాటుగా ప్రసంగించడం తెలిసిందే. పార్టీ శ్రేణులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తడమేకాకుండా, ఏపీలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జయదేవ్‌ను ఘనంగా సన్మానించారు కూడా. 
 
ఈ విమర్శలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు గల్లా జయదేవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని ఆయనకు సన్మానం చేశారో అర్థం కావడం లేదని విమర్శించారు.
 
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించే ఆయన్ని 'విజిటింగ్ ప్రొఫెసర్' అని ప్రజలు పిలుస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశమొస్తే అంతకంటే బాగా మాట్లాడతారని, తమతో పొత్తు తెంచుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు.