మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:06 IST)

జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, నగదు బదిలీ పథకం, వైస్సార్ ఆసరా, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిప్ట్, గాలేరు నగిరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వంటి వాటిపై చర్చించనున్నారు.
 
అలాగే గిరిజన ప్రాంతాలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అమలు, యూరేనియం ప్రభావిత ప్రాంతాలలో ఆయకట్టకు నీరందించే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. కురుపాం ఇంజినీరింగ్ కాలేజీలకు పోస్టులు మంజూరుపై ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
 
అలాగే ఏపీ స్టేట్ డెవలెప్మెంట్ కార్పోరేషన్‌కు ఆమోద ముద్ర పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సమాచారం తెలుస్తుంది.