గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (16:09 IST)

నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు నమోదు

posani krishnamurali
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. వర్గాల మధ్య విభేదాలు తలెత్తెలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు. దీంతో సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. అలాగే, గత వైకాపా పాలనలో సీఎం జగన్ ఉండ చూసుకుని రెచ్చిపోయిన పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
'పుష్ప-2' ట్రైలర్ లాంచ్.. చెప్పులు విసురుకున్న ఫ్యాన్స్.. లాఠీలకు పని... 
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా "పుష్ప-2" ట్రైలర్‌ను ఆదివారం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, కార్యక్రమం జరిగిన స్టేడియంలో ఓ వైపు గందరగోళం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. 
 
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌‍తో నిర్మించింది. ఈ ట్రైలర్‌ను ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో జరిగింది. దీనికి భారీస్థాయిలో అభిమానులు తరలివచ్చారు. 
 
అయితే, ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు.. చివరకు తమ లాఠీలకు పని చెప్పారు. అయితే, కేవలం పోలీసులకు, స్టేడియంలోకి వచ్చిన అభిమానుల మధ్యే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.